లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ధనుష్, కింగ్ నాగార్జున కలయికలో దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన సాలిడ్ చిత్రం కుబేర కూడా ఒకటి. అయితే ఈ సినిమా మంచి బజ్ ని సెట్ చేసుకొని ఎట్టకేలకు థియేటర్స్ లో పాన్ ఇండియా భాషల్లో విడుదల అయ్యింది. మరి కుబేర వరల్డ్ వైడ్ గా మంచి టార్గెట్ తోనే దిగినట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్ సహా అన్ని భాషల్లో కలుపుకొని కుబేర 60 కోట్లకి పైగా బిజినెస్ చేసిందట. ఇక ఇందులో సగం మేర బిజినెస్ మన తెలుగు రాష్ట్రాల్లోని జరిగినట్టు టాక్. ఇంట్రెస్టింగ్ గా తమిళ్ లోనే తక్కువ అట. మరి కుబేర ఈ మొత్తాన్ని రీచ్ అవ్వాలంటే 120కోట్లకి పైగా రాబట్టాల్సి ఉంది. ఇక చూడాలి ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది.