సమీక్ష : 8 వసంతాలు – స్లోగా సాగే లవ్ ఎంటర్ టైనర్ !

సమీక్ష : 8 వసంతాలు – స్లోగా సాగే లవ్ ఎంటర్ టైనర్ !

Published on Jun 20, 2025 2:50 PM IST

విడుదల తేదీ : జూన్ 20, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : అనంతిక,రవితేజ,సుమంత్ నిట్టూర్కర్ తదితరులు.
దర్శకుడు : ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు : నవీన్ యెర్నేని & వై రవిశంకర్
సంగీతం : హేషమ్ అబ్దుల్ వహాబ్
సినిమాటోగ్రఫీ : విశ్వనాథ్ రెడ్డి
ఎడిటర్ : శశాంక్ మాలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘8 వసంతాలు’. కాగా ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ:

శుద్ధి అయోధ్య (అనంతిక) తన తండ్రి చనిపోయిన బాధలో ఉండగా, ఆ బాధ నుంచి బయటపడటం కోసం రచయిత్రిగా మారుతుంది. ఇండియాలో ఉన్న ఆస్తులు అమ్మడం కోసం ఊటీ వచ్చిన వరుణ్ (హను రెడ్డి) శుద్ధితో ప్రేమలో పడతాడు. అతని కేరింగ్ చూసి శుద్ధి కూడా అతన్ని ఇష్టపడుతుంది. అప్పటి వరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. చివరకు వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని నడి రోడ్డున వదిలేసి వెళ్తాడు. స్వాభిమానం, ఆత్మ గౌరవం ఉన్న శుద్ధి ఏం చేస్తుంది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్ర ఏంటి ? అయితే సంజయ్ మీద ఉన్నప్రేమను బయటపెట్టకుండా, శుద్ధి మరో యువకుడితో పెళ్లికి ఎందుకు రెడీ అవుతుంది ?, ఇంతకీ సంజయ్, శుద్ధి ఒకటయ్యారా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

8 వసంతాలు అంటూ సాగిన ఈ సినిమా ఫిల్ గుడ్ లైఫ్ జర్నీలో డైలాగ్స్, కొన్ని ప్రేమ సన్నివేశాలు, అలాగే పాత్రలు. పాత్రల పాయింటాఫ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే.. ఆ ప్రేమిస్తున్న వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది ?, తన ప్రేమతో తన ప్రేయసి ప్రేమను దక్కించుకోవడానికి సంజయ్ పాత్ర చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ఈ మధ్యలో ప్రేమికుల మధ్య ఎమోషన్స్ మరియు కొన్ని ఫీల్ గుడ్ సీన్స్ అండ్ డైలాగ్స్.. ఇవ్వన్నీ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి.

హీరోయిన్ గా నటించిన అనంతిక సనీల్‌కుమార్ నటన సినిమాకి ప్లస్ అయింది. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో ఆమె నటించిన విధానం సినిమాకి ప్లస్ అయ్యింది. హను రెడ్డి తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో హీరోగా నటించిన రవితేజ ఈజ్ తో సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాల్లో రవితేజ నటన బాగుంది. దర్శకుడు స్మరన్ రెడ్డి రాసుకున్న మెయిన్ థీమ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో భావోద్వేగాలను కూడా దర్శకుడు ఎమోషనల్ గా బాగానే తెరకెక్కించాడు.

మైనస్ పాయింట్స్ :

ఈ 8 వసంతాలు కథలో ముగింపు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా, కథ కథానాలు మాత్రం రెగ్యులర్ గానే సాగాయి. నిజానికి సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి విఫలం అయ్యాడు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ ను ఇంకా బలంగా బిల్డ్ చేసి ఉండాల్సింది.

అసలు ఇలాంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం బరువైన భావోద్వేగాలతో.. బలమైన పాత్రలతో స్క్రీన్ ప్లేను నడపాలి. కానీ అలా జరగలేదు. కేవలం డైలాగ్స్ కోసం సీన్స్ ను రాసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే పాత్రల మధ్య ఇంకా బలమైన కాన్ ఫ్లిట్ ను, సన్నివేశాలను రాసుకొని ఉండి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకుడిగా కొన్ని చోట్ల పర్వాలేదనిపించాడు. ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ గా సాగలేదు. కాకపోతే, ఆయన డైలాగ్స్ చాలా బాగున్నాయి. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం పర్వాలేదు. ఎడిటర్ శశాంక్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాలో చాలా వరకు బోర్ తగ్గేది. సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని విజువల్స్ ను చాలా సహజంగా అలాగే చాలా అందంగా చూపించారు. ఫైనల్ గా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు:

‘8 వసంతాలు’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో.. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్, హీరో – హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ ముఖ్యంగా డైలాగ్స్ బాగానే ఉన్నాయి. కానీ, కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా ఉండటం, అలాగే కొన్ని లాజిక్ లెస్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, ఓ స్వచ్చమైన ప్రేమకు నిర్వచనాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా, లవర్స్ కు ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా, మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు