‘వీరమల్లు’కు తప్పని తిప్పలు.. రిలీజ్ డేట్‌పై కొనసాగుతున్న డైలమా!

‘వీరమల్లు’కు తప్పని తిప్పలు.. రిలీజ్ డేట్‌పై కొనసాగుతున్న డైలమా!

Published on Jun 20, 2025 12:08 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అయితే, ఈ చిత్రానికి తిప్పలు ఇంకా తప్పడం లేదు.

ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ చిత్ర రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఇదే ఈ చిత్ర రిలీజ్‌కు ఆటంకం కలిగించే అంశంగా మారిందని తెలుస్తోంది. ఈ చిత్రం పూర్తవక ముందే, ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. అయితే, రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడటంతో ముందుగా ఓకే అయిన డీల్‌ను మార్చేందుకు ఓటీటీ పార్ట్నర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందుగా రూ.75 కోట్ల మేర ఓటీటీ డీల్ కుదిరిందని.. అయితే, రిలీజ్ డేట్ వాయిదా పడటంతో రూ.65 కోట్లకు మార్చారని.. ఇప్పుడు మరో రూ.5 కోట్లు తగ్గించేందుకు సదరు ఓటీటీ పార్ట్నర్ పట్టుబడుతున్నారట. దీనికి చిత్ర నిర్మాత ససేమిరా అంటుండటంతో ఈ చిత్ర రిలీజ్ డేట్ విషయం ఇంకా కొలిక్కి రావడం లేదని సినీ వర్గాల టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు