నేను సంపాదించిన ఆస్తి అదే – బాలయ్య

నేను సంపాదించిన ఆస్తి అదే – బాలయ్య

Published on Jan 19, 2025 12:00 PM IST

నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో సంక్రాంతి కానుకగా వచ్చిన “డాకు మహారాజ్” బ్లాక్‌ బస్టర్‌ టాక్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. పైగా సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో.. ఈ సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ‘డాకు మహారాజ్’ ప్రమోషన్ ఈవెంట్లో బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో తన భార్య వసుంధర తనను తిడుతుందని బాలయ్య చెప్పడం విశేషం. కానీ, తాను ఫిట్‌గా ఉండేందుకు ప్రత్యేక రహస్యం ఏమీ లేదని.. షూటింగ్ సమయంలో తాను ప్రొడక్షన్ ఫుడ్ కూడా తింటానని బాలకృష్ణ చెప్పారు.

అలాగే బాలయ్య ఇంకా మాట్లాడుతూ.. పార్టీలకు, కులాలకు అతీతంగా తనకు అందరు ఫ్యాన్స్ ఉన్నారని.. జీవితంలో అదే తాను సంపాదించిన ఆస్తి అని బాలయ్య తెలిపారు. మొత్తానికి డాకు మహారాజ్ తో ఈ సంక్రాంతి సీజన్‌లో బాలకృష్ణ మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ మరియు శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే, చాందిని చౌదరి, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, బేబీ వేద అగర్వాల్ మరియు VTV గణేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు