చిరు కోసం సైకిల్ యాత్ర చేసిన మహిళా వీరాభిమాని.. మెగాస్టార్ భరోసా

చిరు కోసం సైకిల్ యాత్ర చేసిన మహిళా వీరాభిమాని.. మెగాస్టార్ భరోసా

Published on Aug 29, 2025 12:52 PM IST

తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి దిగ్గజ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో మెగాస్టార్ కి కోట్లాదిమంది అభిమానులు సొంతం అయ్యారు. తాను అంటే ప్రాణం పెట్టే వీరాభిమానుల్లో ఒక మహిళా అభిమాని మెగాస్టార్ ని కదిలించారు. ఆదోనికి చెందిన రాజేశ్వరి అనే గృహిణి మెగాస్టార్ కి వీరాభిమాని కాగా తన హీరోని కలిసేందుకు సైకిల్ మీద ఆదోని నుంచి హైదరాబాద్ కి పయనమయ్యారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న చిరు ఆమెని తన పిల్లలని తన ఇంటి వద్ద కలిసిన విజువల్స్ ఇపుడు వైరల్ గా మారాయి. చిరంజీవి ఆహ్వానం ఆమె చిరుకి రాఖీ కట్టిన దృశ్యాలు అభిమానులని కదిలిస్తున్నాయి. ఇక ఇదే మీటింగ్ లో మెగాస్టార్ తన ఉదారతను చాటుకున్నారు.

ఆమె ఇద్దరి పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు తాను వారి భాద్యతలు తీసుకుంటానని ఆ పిల్లలకి తాము పెద్దయ్యాక బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకోవాలని సూచించిన క్షణంలో ఆమె ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఇలా బ్యూటిఫుల్ విజువల్స్ సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు