తెలుగు ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉన్నటువంటి తమిళ హీరోస్ లో విశాల్ కూడా ఒకరు. ఎప్పుడో తెలుగు స్టేట్స్ లో సూపర్ హిట్స్ కొట్టిన విశాల్ ఇప్పుడు ‘మకుటం’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అయితే కొన్నాళ్ల నుంచి తన పెళ్ళికి సంబంధించి పలు రూమర్స్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఒకో నటి పేరు వినిపించింది కానీ ఫైనల్ గా హీరోయిన్ సాయి ధన్సిక ని విశాల్ వివాహం చేసుకోనున్నాడు అని కన్ఫర్మ్ అయ్యింది.
మరి నేడు విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నట్టుగా విశాల్ ఇచ్చిన గుడ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమెతో ఎంగేజ్మెంట్ సహా ఇద్దరు కుటుంబాలు కలిసి కనిపించిన మూమెంట్స్ వైరల్ అయ్యాయి. దీనితో ఈ వార్త విన్న సినీ ప్రముఖులు అలాగే అభిమానులు తమ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.