యాపిల్ కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రపంచానికి సెప్టెంబర్ 9, 2025న పరిచయం చేయబోతోంది. ఈ ప్రత్యేక కార్యక్రమం (“Awe Dropping Event”) రాత్రి 10:30 ISTకి ప్రారంభమవుతుంది.
ఈ సారి యాపిల్ మొత్తం నాలుగు మోడల్స్‌ను తీసుకొస్తుందని సమాచారం:
1. ఐఫోన్ 17
2. ఐఫోన్ 17 ప్రో
3. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
4. కొత్త సన్నని మోడల్ – ఐఫోన్ 17 ఎయిర్ (ఇది “ప్లస్” మోడల్‌కి బదులుగా వస్తుంది)
ఇండియా లో సెప్టెంబర్ 12, 2025 నుండి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 19, 2025 నుండి స్టోర్ అమ్మకాలు కూడా మొదలవుతాయని అంచనా.
లీక్‌ల ప్రకారం, ఈసారి యాపిల్ ఫోన్లతో పాటు ఒక కొత్త యాక్సెసరీ – Crossbody Strapను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇది అయస్కాంత శక్తిపై ఆధారపడి, ఫోన్ కేస్‌లను సులభంగా పట్టుకోవడం, అన్‌లాక్ చేయడం చేస్తుంది. దీన్ని AirPods Pro 3 కి కూడా వాడుకునే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఇండియాలో ఎంత?
ఆధికారిక ధరలు ఇంకా ప్రకటించలేదు. అయితే నిపుణులు చెబుతున్న అంచనా ప్రకారంగా, ధరలు గత ఐఫోన్ 16 సిరీస్‌తో పెద్దగా తేడా ఉండకపోయినా, చిన్న పెరుగుదల ఉండే అవకాశం ఉంది.
అంచనా ధరలు (ఇండియా):
1. ఐఫోన్ 17: ₹79,900 – ₹82,900
2. ఐఫోన్ 17 ఎయిర్: ₹94,900 – ₹99,900
3. ఐఫోన్ 17 ప్రో: సుమారు ₹1,29,900
4. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్: సుమారు ₹1,49,900
ఈ సారి కొత్త రంగుల ఎంపికల్లో డీప్ బ్లూ మరియు సన్‌సెట్ గోల్డ్ కూడా ఉండే అవకాశం ఉంది.
ఐఫోన్ 17 విడుదల ఈ ఏడాది టెక్ ప్రపంచంలో అతిపెద్ద ఈవెంట్‌గా భావిస్తున్నారు.
కొత్త డిజైన్లు, మెరుగైన కెమెరా ఫీచర్లు, AI ఆధారిత పనితీరు ఈ ఫోన్ ఆకర్షణ.
ఇండియాలో సెప్టెంబర్ మధ్యలోనే ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, పండగ సీజన్ మొదలయ్యేలోపు అమ్మకాలు మొదలవుతాయి.