“తండేల్”.. 3 రోజుల్లోనే అంత రాబట్టేసిందా?

“తండేల్”.. 3 రోజుల్లోనే అంత రాబట్టేసిందా?

Published on Feb 9, 2025 7:00 PM IST

అక్కినేని అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ లలో యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కంబ్యాక్ కూడా ఒకటి. మరి ఈ కంబ్యాక్ ఫైనల్ గా ఇపుడు “తండేల్” తో వచ్చేసింది అని చెప్పవచ్చు. మొదటి నుంచీ ఈ సినిమా పట్ల మేకర్స్ చాలా నమ్మకంగా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయ్యిన మొదటి రోజే సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకొని అదరగొట్టింది.

కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 41 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా 3 రోజుల్లో 50 కోట్ల మార్క్ ని కూడా ఈజీగా దాటేస్తుంది. ఇక ఇదిలా ఉండగా తండేల్ వరల్డ్ వైడ్ గా పెట్టుకున్న టార్గెట్ ని కేవలం ఈ మూడు రోజుల్లోనే 75 శాతానికి మేర రాబట్టేసినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దీనితో చైతు కంబ్యాక్ గట్టిగానే వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అలాగే గీతా ఆర్ట్స్ 2 వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

తాజా వార్తలు