శేఖర్ కమ్ముల నెక్స్ట్.. ‘కుబేర’ కాంబినేషన్ మళ్ళీ!

శేఖర్ కమ్ముల నెక్స్ట్.. ‘కుబేర’ కాంబినేషన్ మళ్ళీ!

Published on Aug 27, 2025 7:04 PM IST

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చి హిట్టయ్యిన చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల అలాగే ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన మనీ, ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “కుబేర”. కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చినప్పటికీ సాలిడ్ హిట్ గా నిలిచిన ఈ సినిమా శేఖర్ కమ్ముల కెరీర్ లో మరో మంచి సినిమాగా నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరితో అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది. ఈ సినిమాకి నిర్మాణ సంస్థగా చేసిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మళ్ళీ తాము శేఖర్ కమ్ముల తో కలిసి పని చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఈ వినాయక చవితి సందర్భంగా అనౌన్స్ చేసి మళ్ళీ సినిమా చేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ప్రస్తుతానికి ఆరంభ దశలోనే ఉందని ఎప్పుడు మొదలవుతుంది నటీనటులు ఇతర సిబ్బంది ఎవరు అనేది త్వరలోనే రివీల్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. మరి ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

తాజా వార్తలు