టాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో.. ఈసారి నిఖిల్ వంతు

టాలీవుడ్ నుంచి మరో సూపర్ హీరో.. ఈసారి నిఖిల్ వంతు

Published on Aug 28, 2025 1:00 AM IST

nikhil

పాన్ వరల్డ్ సినిమా దగ్గర మంచి పాపులారిటీ ఉన్న జానర్ లలో సూపర్ హీరో జానర్ కూడా ఒకటి. అయితే మన ఇండియన్ సినిమా దగ్గర ఈ జానర్ లో చాలా తక్కువ సినిమాలే కనిపిస్తాయి. ఇక మన తెలుగు సినిమా దగ్గర కూడా ఇవి ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇలా లేటెస్ట్ గా వచ్చిన చిత్రం హను మాన్, ఈ సినిమా తర్వాత మళ్ళీ అదే హీరో తేజ సజ్జ నుంచి వస్తున్న సూపర్ హీరో తరహా సినిమానే ‘మిరాయ్’. అయితే ఇప్పుడు టాలెంటెడ్ హీరో నిఖిల్ వంతు కూడా వచ్చినట్టు కనిపిస్తుంది.

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ లో పలు సాలిడ్ కంటెంట్ థ్రిల్లర్స్ బాగా ఊపందుకున్నాయి. కానీ వీటిని ఎపుడు నుంచో స్టార్ట్ చేసిన యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. మరి తన నుంచి ఇప్పుడు అనౌన్స్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ పోస్టర్ చూస్తుంటే ఇది కూడా సూపర్ హీరో సినిమా లానే అనిపిస్తుంది. కుబేర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిఖిల్ తో ఓ భారీ సినిమాని ఇప్పుడు అనౌన్స్ చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని డీటెయిల్స్ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

తాజా వార్తలు