‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!

‘స్పిరిట్’పై క్రేజీ బజ్.. ఇది మామూలు ట్విస్టు కాదుగా..!

Published on Aug 28, 2025 3:00 AM IST

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే, ఆ తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేయబోతున్నాడు.

‘స్పిరిట్’ అనే టైటిల్‌తో రాబోయే ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడట. అయితే, ఈ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా పెద్ద ప్లాన్ వేశాడని.. అందులో భాగంగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తారనే క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సందీప్ రెడ్డి వంగా చిత్రాల్లో కేమియో పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది ఆయన తన అభిమాన నటుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఎలాంటి పవర్‌ఫుల్ పాత్రను రాసుకుని ఉంటాడా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే, చిరంజీవి ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. మరి ఆయన కోసం నిజంగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ చిత్రంలో కేమియో పాత్రను రాసుకున్నాడా.. అసలు ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది..? అనేది తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు