పెద్ది ‘సుందరి’కి పెద్ద పరీక్షే..!

పెద్ది ‘సుందరి’కి పెద్ద పరీక్షే..!

Published on Aug 28, 2025 2:00 AM IST

అందాల భామ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’ చిత్రంతో అడుగు పెట్టింది. తెలుగులో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది. అయితే, ఈ బ్యూటీ ఇప్పుడు తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు సిద్ధమైంది.

జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో చాలా సినిమాలే చేసింది. అయితే, అమ్మడికి ఇటీవల కాలంలో సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. ఆమె నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో తనకు గుర్తింపును తీసుకురాలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఓ సాలిడ్ హిట్ అందుకోవాలని ‘పరమ్ సుందరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది.

మరి ఈ సినిమాతో బాలీవుడ్‌లో జాన్వీ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిట్ దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇక ‘పరమ్ సుందరి’ చిత్రం ఆగస్టు 29న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

తాజా వార్తలు