రామ్ చరణ్ త్వరలో వి వి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న “నాయక్” చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో పోరాట సన్నివేశాలలో రామ్ చరణ్ అద్భుతమయిన ప్రదర్శన కనబరచారని ఈ పోరాట సన్నివేశాలు అభిమానులకు కన్నులపండుగని సమాచారం. ఈ విషయమై తమన్ ట్విట్టర్లో “నాయక్ చిత్రంలోని ఒక ఫైట్ సన్నివేశాన్ని చూసాను చోటా గారి ప్రతిభ కనిపించింది అభిమానులకు ఈ చిత్రం కన్నులపండుగ కానుంది” అని చెప్పారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ మరియు అమలా పాల్ నటిస్తున్నారు. రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్టు సమాచారం. గత నెలలో ఈ చిత్ర బృందం టాకీ కొంత భాగం మరియు మూడు పాటల చిత్రీకరణకు యూరప్ వెళ్ళారు. ఐస్ ల్యాండ్ లో రామ్ చరణ్ మరియు అమల పాల్ మీద “శుభలేఖ రాసుకున్నా” రీమిక్స్ పాటను తెరకెక్కించారు. మిగిలిన రెండు పాటలను రామ్ చరణ్ మరియు కాజల్ నడుమ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ ఈరోజుతో ముగియనుంది చిత్ర బృందం మొత్తం మరో రెండు రోజుల్లో ఇండియాకు తిరిగి రానుంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.