
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2 తాండవం”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా ఇప్పుడు రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ తమకి కావాల్సిన హై కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్ట్ కే మ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ని థియేటర్స్ లో పొందడానికి గల కారణాల్లో సంగీత దర్శకుడు థమన్ వర్క్ కూడా ఒకటి.
ముఖ్యంగా అఖండ 1 ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమాని తాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. మరి అదే థమన్ ఇప్పుడు మళ్ళీ అఖండ 2 ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అఖండ 2 ఇంటర్వెల్ ఏం హై రా బాబు అంటూ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా ఉండడంతో అఖండ 2 ఇంటర్వెల్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈసారి ఇంటర్వెల్ ఎలా ఉందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 4 వరకు ఆగితే తేలిపోతుంది.
Emmmm high raaaa babu !!
A-K-H-A-N-D-A-I-N-T-E-R-V-A-L ????
— thaman S (@MusicThaman) November 26, 2025

