పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే, ఈ సినిమాలో తనకు ఛాన్స్ రావడంపై రిద్ధి కుమార్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నిర్మాత ఎస్‌కెఎన్ తనకు కాల్ చేసి, ప్రభాస్‌తో సినిమా చేస్తున్నామని.. అందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని.. అందులో తనకు ఒక రోల్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపారట. అయితే, తనపై నిర్మాత ప్రాంక్ చేస్తున్నానని ఆమె అనుకుందట.
తన మేనేజర్‌ను దీనిపై అడగ్గా, అది నిజమే అని తెలుసుకుని తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయని రిద్ధి కుమార్ తెలిపింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని ఆమె పేర్కొంది.


