కన్నడ సినిమా నుంచి ఈ ఏడాది వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన భారీ చిత్రమే “కాంతార చాప్టర్ 1”. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి నటించిన ఈ డివోషనల్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా గత నెలలోనే పాన్ సౌత్ భాషల్లో ఓటిటి స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు ఫైనల్ గా హిందీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ మరియు మలయాళ భాషల్లో ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్ట్రీమింగ్ తీసుకొచ్చారు.
ఇక హిందీ భాషలో కూడా ఇదే స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ వారు తీసుకొచ్చారు. సో హిందీ ఆడియెన్స్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రం హిందీలో 200 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఇక హిందీలో వచ్చాక ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా రుక్మిణి వసంత్, జైరాం తదితరులు నటించారు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


