రాజు వెడ్స్ రాంబాయి.. వారికి రేపు ఫ్రీ షోలు!

రాజు వెడ్స్ రాంబాయి.. వారికి రేపు ఫ్రీ షోలు!

Published on Nov 26, 2025 10:03 PM IST

Raju-weds-rambhi

టాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ కల్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. కొత్త దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించిన ఈ రూరల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు యూత్, లవర్స్ అందరూ కనెక్ట్ అవుతుండటంతో ఈ సినిమాకు మాసివ్ రెస్పాన్స్ దక్కుతోంది.

అయితే, ఈ సినిమాను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మేకర్స్ ఓ సాలిడ్ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల్లోని మహిళలకు ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో ఈ చిత్ర ఉచిత ప్రదర్శనను మహిళలను వీక్షించవచ్చు. తాము ప్రకటించిన థియేటర్ల వద్ద మహిళా ప్రేక్షకులు ఉచిత టికెట్లు పొందవచ్చని మేకర్స్ వెల్లడించారు.

దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రేపు (నవంబర్ 27) ఈ ఉచిత ప్రదర్శనతో మహిళా లోకానికి ఈ సినిమా మరింత చేరువ అవుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్వి రావు, చైతూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రల్లో నటించారు. వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

raju

ra

తాజా వార్తలు