‘ఓజి’ లాంటి సినిమా ఎప్పుడో కొట్టేవాళ్ళం.. పవన్ హాట్ కామెంట్స్ వైరల్

‘ఓజి’ లాంటి సినిమా ఎప్పుడో కొట్టేవాళ్ళం.. పవన్ హాట్ కామెంట్స్ వైరల్

Published on Nov 26, 2025 9:00 PM IST

OG-Pawan-Kalyan-1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఇటీవల ఓ రేంజ్ హైప్ లో వచ్చిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా “ఓజి” సినిమానే అని చెప్పాలి. అప్పట్లో జానీ సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హైప్ ని ఈ సినిమాతో చూసినట్టు అభిమానులు చెబుతారు. ఇలా సుజీత్ తెరకెక్కించిన ఓజి సినిమాకి అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యింది మంచి వసూళ్లు వచ్చేశాయ్, ఓటిటిలో కూడా ఈ సినిమా వచ్చేసింది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా విషయంలో పవన్ చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. మన ఓజి లాంటి సినిమాలు ఎపుడో 2004 తర్వాతే కొట్టేవాళ్ళం అని తాను తెలిపారు.

కానీ అప్పుడు తన దృష్టి అంతా సినిమాల వైపు కాకుండా సమాజం వైపు ఉండేది అని ఇలా అక్కడ నుంచి మీరంతా (ఫ్యాన్స్) రాజకీయాలు అంటూ చావగొడుతున్నావ్ అంటే మీకోసం, మీరు బాధ పడుతున్నారని ఓజి సినిమా చేసానని వ్యాఖ్యానించారు. దీనితో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, అభిమానుల నడుమ మంచి వైరల్ గా మారాయి. ఓ రకంగా చాలా మంది ఫ్యాన్స్ కూడా పవన్ కేవలం సినిమాల మీదే దృష్టి పెట్టి ఉంటే తన స్టార్డం ఇప్పుడు ఇంకో రేంజ్ లో ఉండి ఉండేది అని ఇప్పటికీ భావిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు