థలపతి “మాస్టర్” స్ట్రైక్ వచ్చేది అప్పుడేనా.?

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ థలపతి విజయ్ కు ఇప్పుడిప్పుడే మన దగ్గర కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుంది. “సర్కార్”, “విజిల్” సినిమాలతో తెలుగు మూవీ లవర్స్ కు కూడా మంచి దగ్గరైన థలపతి విజయ్ ఇపుడు నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” తో కూడా రెడీగా ఉన్నాడు. అక్కడి టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మన దక్షిణాది నుంచి రానున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ప్లస్ అయ్యింది. పైగా ఇంకా ఎలాంటి టీజర్ కూడా రాకుండానే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం రిలీజ్ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ మూలాన ఆగిపోవాల్సి వచ్చింది.

మధ్యలో భారీ ఓటిటి డీల్స్ వచ్చినా ఫ్యాన్స్ మాత్రం థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని గట్టి డిమాండ్ చెయ్యడం మేకర్స్ కూడా మొగ్గు చూపకపోవడంతో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కే స్టిక్ అయ్యింది. అయితే ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో ఈ థలపతి విజయ్ “మాస్టర్” స్ట్రైక్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో నిలపడానికి టైం ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరి ఈ చిత్రం రిలీజ్ టైం కు పరిస్థితులు ఎలా ఉండనున్నాయి చూడాలి.

Exit mobile version