“జాంబీ రెడ్డి”గా “ఇంద్ర”సేనా రెడ్డి.!

“జాంబీ రెడ్డి”గా “ఇంద్ర”సేనా రెడ్డి.!

Published on Aug 23, 2020 12:00 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జ కెరీర్ లో ఎన్నో బెంచ్ మార్క్ రోల్స్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ “ఇంద్ర”లో ఇంద్రసేనా రెడ్డిగా కనిపించిన రోల్ కూడా ఒకటి. అలా ఎన్నో చిత్రాల్లో కనిపించిన తేజ సజ్జ ఇటీవలే “ఓ బేబీ”లో కూడా కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఇపుడు మన టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బెంచ్ మార్క్ చిత్రం “జాంబీ రెడ్డి”లో హీరోగా తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కనిపించి ఆశ్చర్య పరిచాడు.

తన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్న వైవిధ్య ఫిలిం మేకర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కావాల్సిన హైప్ ను తెచ్చుకున్నారు. అలా మొన్న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా చిరు కి విషెష్ చెప్తూ ఒక చిరు జాంబీలా కనిపించిన ఒక పోస్టర్ తో తెలిపారు. ఇప్పుడు మొత్తానికి ఆ టి షర్ట్ వేసుకున్న తేజ సజ్జ ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. కాగా దీనికి ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. మొత్తానికి అప్పటి ఇంద్రసేనా రెడ్డిగా కనిపించిన తేజ సజ్జ ఇప్పుడు “జాంబీ రెడ్డి”గా ఎలా కనిపించనున్నాడో చూడాలి మరి.

తాజా వార్తలు