ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి కరోనా బారి నుంచి తప్పించుకొని కోలుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడిప్పుడే కోలుకున్న జక్కన్న కు మరో ఒత్తిడి కూడా వస్తుంది. తాను ఇప్పుడు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”లో కొమరం భీం గా కనిపించనున్నారు.
ఈ భారీ చిత్రంలో తారక్ లుక్ కు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. దీనితో రాజమౌళిని తారక్ అభిమానులు ఎప్పటి నుంచో తారక్ లుక్ ను మరియు టీజర్ ను విడుదల చెయ్యాలని అడుగుతున్నారు. కానీ రాజమౌళికి మాత్రం ఎప్పుడు ఏదొక అడ్డం వస్తూనే ఉంది. కానీ తాజాగా రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా మాత్రం మంచి హింట్ ఇచ్చారు.
వైద్యుల సలహాల మేరకు తాము షూటింగ్స్ మొదలు పెట్టి తర్వాత తారక్ కు చెందిన లుక్ మరియు టీజర్ ను ప్లాన్ చేస్తామని అన్నారు. అంటే తర్వాత ఈ ఏడాదిలో వచ్చే ఏదొక పండుగ రోజుకు కానీ సంక్రాంతికి కానీ ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట. మరి తారక్ అభిమానులను జక్కన్న ఎప్పుడు ఖుషీ చేస్తాడో చూడాలి.