తారక్ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మారింది.!

తారక్ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ మారింది.!

Published on Aug 22, 2020 9:20 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాస్త డిజప్పాయింట్ గా ఉన్నారని చెప్పాలి. ఇతర అగ్ర హీరోలకు సంబంధించి వారు చేస్తున్న సినిమాల తాలూకా లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నాయి కానీ తారక్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించి మాత్రం దాదాపు రెండేళ్ల నుంచి సరైన అప్డేట్ ఒకటి కూడా లేక బాధపడుతున్నారు. తారక్ నటిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం” టీం నుంచి ప్రతీ స్పెషల్ ఈవెంట్ కు ఏదొక అప్డేట్ వస్తుందని భావించారు.

కానీ అది ఇప్పుడప్పుడే నిజమయ్యేలా లేదు. దీనితో రాజమౌళి ఇచ్చేది ఏదో అప్పుడే ఇస్తారు అని తమ ఇంట్రెస్ట్ ను మార్చుకున్నారు. ఇప్పుడు వీరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కు సంబంధించి ఏదన్నా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఇది తప్ప మరో అంశం ఏది బయటకు రాలేదు. దీనితో ఏదన్నా చిన్న అప్డేట్ ఇమ్మని మేకర్స్ ను వీరు కోరుకుంటున్నారు. మరి తారక్ అభిమానుల ఆశ ఎపుడు నెరవేరుతుందో..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు