తెలుగు పరిశ్రమలో కొత్త యువ దర్శకులే కాదు ఇతర భాషల దర్శకులు కూడ పెరుగుతున్నారు. తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి తమిళ డైరెక్టర్లు చాల ఆసక్తి చూపుతున్నారు. తమిళ హీరోలు తెలుగు మార్కెట్ మీద ఎన్నాళ్లగానో కన్నేసి ఈమధ్యే పట్టు పెంచుకుంటుండగా ఇప్పుడు అక్కడి దర్శకులు సైతం టాలీవుడ్ టర్న్ తీసుకుంటుండటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే స్టార్ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ హీరోగా భారీ బడ్జెట్ సినిమాను ప్రకటించగా తాజాగా లింగుస్వామి రామ్ హీరోగా కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. గతంలో మురుగదాస్ కూడ ‘స్టాలిన్, స్పైడర్’ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్నవారే. ఇన్నాళ్లు తమ సినిమాలను డబ్బింగ్ చేసి పేరు తెచ్చుకున్న కోలీవుడ్ డైరెక్టర్లు ఇప్పుడు నేరుగా తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. త్వరలో అట్లీ తెలుగు స్టార్ హీరోతో స్ట్రయిట్ సినిమా చేస్తారనే టాక్ ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్ సైతం టాలీవుడ్ హీరోతో సినిమా చేసే యోచనలో ఉన్నారు. ఈ పరిణామం తెలుగు పరిశ్రమ మార్కెట్ స్థాయి, స్పాన్ పెరిగిందనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.