దూకుడు ప్రదర్శించే పాత్రలో తమన్నా

దూకుడు ప్రదర్శించే పాత్రలో తమన్నా

Published on Oct 17, 2012 4:00 PM IST


మిల్క్ బ్యూటీ తమన్నా మొదటి సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ చిత్రంలో చాలా దూకుడుగా మరియు అందరి మీద ధైర్యంగా అందరినీ అదుపుచేయగల పాత్రని తమన్నా పోషించారు. తమన్నా తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. ఈ సినిమాలో పవన్ ని ఒక జర్నలిస్ట్ గా మారమని ప్రభావితం చేసే పాత్రలో కూడా కనిపించనున్నారు.

ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మరియు పవన్ – తమన్నా కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్ అవుతాయని సమాచారం. ఈ సినిమా భారీగా అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానుంది. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు