సత్యదేవ్, తమన్నా కలిసి నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఆడియో రైట్స్ కు గానూ రూ .75 లక్షలను సాధించింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆనంద్ ఆడియో రూ .75 లక్షలు ఇచ్చి ఈ సినిమా ఆడియో రైట్స్ ను తీసుకుంది. ఈ సందర్భంగా నాగ శేఖర్ మాట్లాడుతూ, “సత్య దేవ్ మరియు తమన్నా కలిసి నటించడం ఈ చిత్రానికి బిగ్ ఎస్సేట్. సినిమా పై భారీ అంచనాలను సృష్టించింది. చాలా అభినందన కాల్స్ వస్తున్నాయి. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందనే భావన రోజురోజుకూ పెరుగుతుంది. మేము షూట్ ప్రారంభించక ముందే ఆనంద్ ఆడియో మా సినిమా ఆడియో హక్కులను దక్కించుకోవడం ఆనందంగా ఉంది. కీరవాణిగారి కుమారుడు కాలా భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అని అన్నారు.
కాగా కన్నడలో సూపర్ హిట్టైన లవ్ మాక్ టైల్ సినిమా తెలుగు రీమేక్ కాబోతుంది. కృష్ణ దర్శక నిర్మాతగా అతనే హీరోగా నటించిన సినిమా లవ్ మాక్ టైల్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్కడ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అక్కడ సూపర్ హిట్టైన ఈ సినిమాని తెలుగులో నాగ శేఖర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తన సత్తా చాటిన సత్యదేవ్ ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపిస్తాడేమో చూడాలి.