తమన్నా తన మొదటి హిందీ చిత్రం ‘హిమ్మత్ వాలా’ విడుదలకు ముందే బాలీవుడ్లో కొంతమందిని ఆకట్టుకుంది. తాజా సమాచారం ప్రకారం తను అక్షయ్ కుమార్ సరసన నటించడానికి చర్చలు జరుగుతున్నాయట. టిప్స్ ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ తరుణీ ఈ సినిమాని నిర్మిస్తుండగా సజీద్ మరియు ఫర్హాద్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. అక్షయ్ కుమార్ ఇప్పటికే ఏ. ఆర్ మురుగదాస్ చిత్రాలు తుపాకీ, రమణ(తెలుగు లో ఠాగూర్) కి అనువాద హక్కులు సంపాదించాడు. ఈ చిత్రాలు త్వరలోనే మొదలు కానున్నాయి.
ఈ ప్రాజెక్ట్ లలో కనుక తమ్మన్నా చేరితే తప్పకుండా బాలీవుడ్లో తన స్థానం సుస్థిరం అవుతుంది. ‘హిమ్మత్ వాలా’లో తను అజయ్ దేవగన్ ప్రేమికురాలిగా కనిపించనుంది. విచిత్రమేమిటంటే కాజల్ అగర్వాల్ కుడా బాలీవుడ్లో మొదటి సినిమా అజయ్ దేవగన్ తో కలిసి నటించి తరువాత ‘స్పెషల్ 26’లో అక్షయ్ కుమార్ సరసన కనిపించింది.