మిల్క్ బ్యూటీ తమన్నాకి మరో పెద్ద ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇలయదళపతి విజయ్ త్వరలో మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’ మొదలుపెట్టనున్నారు. ఇందులో కథానాయికగా తమన్నా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమైనదట. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే అఫీషియల్ క్కన్ఫర్మేషన్ రావొచ్చని కోలీవుడ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి.
అలాగే కాజల్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందట, కాజల్, విజయ్ గతంలో ‘మెర్సల్, జిల్లా’ చిత్రాల్లో కూడా కలిసి నటించారు. ఇక ఇప్పటికే ‘ముంబై సాగా, ఇండియన్ 2’ చిత్రాల్లో నటిస్తున్న కాజల్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’లో కూడా కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఇలా మొత్తం మూడు భారీ ప్రాజెక్ట్స్ నే చేస్తోంది కాజల్. తమన్నా కూడా చిన్న సినిమాలతో పాటు ఒక్కొక్కటిగా పెద్ద సినిమా ఆఫర్లను అందుకుంటున్నారు.