‘కిక్ 2’ లో తమన్నా?

‘కిక్ 2’ లో తమన్నా?

Published on Mar 20, 2014 4:35 PM IST

Tamannaah

2009లో మాస్ మహారాజ రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ఈ సంవత్సరం సెకండాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ సినిమాకి గురించి విశేషాలు ఏమి బయటకు తెలియజేయలేదు.

తాజాగా ఈ సినిమా విషయంలో తమన్నా పేరు వినిపిస్తోంది. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ కోసం తమన్నాని పరిశీలిస్తున్నారు. కానీ తమన్నా ఈ విషయం పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

‘కిక్’ సినిమాలానే ‘కిక్ 2’ కూడా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. మేము ఈ విషయం గురించి పూర్తి వివరాలను త్వరలో అందజేస్తాం. దాని కోసం మా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.

తాజా వార్తలు