అలా చేస్తే నిజంగా మర్డర్ చేసినట్టా? – తమన్నా

అలా చేస్తే నిజంగా మర్డర్ చేసినట్టా? – తమన్నా

Published on Oct 23, 2012 2:40 PM IST


“కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో నటించినందుకు తనకి చాలా ఆనందంగా ఉందని తమన్నా చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రముఖ పత్రికకు చెప్తూ ఆయన్ని ఆఫ్ స్క్రీన్ ఎక్కువగా చూడలేదు కాని అయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని మాత్రం చెప్పగలను అయన ఈ చిత్రంలో నటించలేదు జీవించారని నా ఉద్దేశ్యం. వైవిధ్యమయిన పాత్రలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను, కొన్ని చిత్రాలలో సైలెంట్ గా ఉండే పాత్ర అయితే కొన్నింటిలో అల్లరి చేసే పాత్ర ఈ చిత్రంలో టాం బాయ్ లా కనిపించే పాత్ర చేశాను అని అన్నారు. పూరి జగన్నాథ్ మరియు పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో చిత్రం చెయ్యడం నిజంగా తనకి ఆనందాన్ని ఇచ్చింది అని అన్నారు. చిత్రంలో బీర్ తాగారు నిజంగా అలవాటుందా అన్న ప్రశ్నకు చిత్రంలో మర్డర్ చేస్తాను నిజంగా చేసినట్టా?అని ఎదురు ప్రశ్న వేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ నటి తెలుగులో నాగ చైతన్య సరసన ఒక చిత్రం చేస్తుండగా హిందీలో “హిమ్మత్వాలా” చిత్రంలో నటిస్తుంది.

తాజా వార్తలు