నిత్య మీనన్ ఇంకొంచెం పొడుగు ఉండుంటే.. – బాలకృష్ణ

నిత్య మీనన్ ఇంకొంచెం పొడుగు ఉండుంటే.. – బాలకృష్ణ

Published on Oct 22, 2012 12:14 PM IST


అలా మొదలైంది సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఆడుగు పెట్టిన నిత్య మీనన్ ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. నటన మరియు గ్లామరస్ రెండింటిని బాలన్స్ చేస్తూ ఇష్క్ సినిమాలో కూడా మెప్పించింది. ఇండస్ట్రీలో చాలా మంది ఆమెను పొగుడుతుంటారు. ఆ జాబితాలో బాలయ్య కూడా చేరారు. ఆమె నారా రోహిత్ సరసన నటిస్తున్న తాజా చిత్రం ఒక్కడినే. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న జరిగింది. ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిదిగా విచ్చేసిన బాలకృష్ణ మాట్లాడుతూ సౌందర్య తరువాత సహజ నటిగా నిత్య మీనన్ నిరూపించుకుంటుంది. ఆమె ఇంకొంచెం పొడుగు ఉండుంటే నేను తీద్దామనుకున్న ‘నర్తనశాల’ సినిమాలో ద్రౌపది పాత్ర ఆమెతో చేయించే వాడిని అన్నారు. నిత్య కొంచెం పొడుగు ఉండుంటే బాలయ్య సరసన హీరొయిన్ గా నటించే అవకాశం కొట్టేసేది.

తాజా వార్తలు