రాంబాబుని ఆపివేసిన తెలంగాణ వాదులు

రాంబాబుని ఆపివేసిన తెలంగాణ వాదులు

Published on Oct 19, 2012 12:45 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ జర్నలిస్ట్ గా నటించిన ‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో తెలంగాణాకి విరుద్దంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులంతా కలిసి హైదరాబాద్ లోని ఆరాధన థియేటర్లో సినిమా ప్రదర్శించకుండా ఆపివేశారు. తెలంగాణా ప్రాంతంలో ఎక్కడా ఆ సినిమా ప్రదర్శించకూడదని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్లో తెలంగాణా వాదులు సినిమా ప్రదర్శన నిలిపివేసి, ఈ సినిమా కటౌట్స్ ని తగలబెట్టారు మరియు థియేటర్ ని పగల కొట్టారు. ఈ సినిమాలో జాతీత్య సమైక్య వాదం గురిచి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కానీ తెలంగాణాని నేరుగా కించ పరిచే డైలాగ్స్ ఏమీ లేవు. ఈ సమస్యను ఆపడానికి ధర్నా చేస్తున్న తెలంగాణా వాదులతో ప్రస్తుతం ఈ చిత్ర ప్రొడక్షన్ టీం మరియు డిస్ట్రిబ్యూటర్స్ మంతనాలు జరుపుతున్నారు.

తాజా వార్తలు