బిగ్ బాస్4 – ఈ కంటెస్టెంట్ కు సింపతీ ఇంత గట్టిగా వర్కౌట్ అయ్యిందా?

మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 ఇప్పుడు మరింత స్థాయిలో రసవత్తరంగా కొనసాగుతుంది. అలాగే ఇప్పటికే ఈ షో సగానికి చేరుకోవడంతో హౌస్ లో పరిమాణాలు కూడా వేగంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు సడెన్ గా ఓ కంటెస్టెంట్ పై సోషల్ మీడియాలో రచ్చ గట్టిగా నడుస్తుంది. అదే ఫీమేల్ కంటెస్టెంట్ అరియానా కోసం.

గత కొన్నాళ్ల నుంచి పెద్దగా వెలుగులోకి రాని అరియానా ఇప్పుడు ఏకంగా ఇండియన్ ట్రెండ్స్ లోకి ఈమె పేరు వచ్చేసింది. దీనితో సదరు నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి ఎపిసోడ్ అంతా ఒక్కసారే ఆమెను నామినేట్ చెయ్యడంతో ఆమెకు ఒక్కసారిగా సింపతీ పెరిగింది తప్ప ఆమె గొప్పగా ఆడింది లేదు మరి సడెన్ గా ఈ రేంజ్ లో అంతా సింపతీ చూపడం ఏంటా అని అనుకుంటున్నారు.

అలాగే తనలోని పాజిటివ్ కోణాన్ని చూసిన వాళ్ళు ఆమెకు భీభత్సంగా సపోర్ట్ చేస్తున్నారు. కేవలం వారితో పాటుగా ఇంతకు ముందు సపోర్ట్ చెయ్యని వారు కూడా సపోర్ట్ చెయ్యడం గమనార్హం. మొత్తానికి మాత్రం ఈ కంటెస్టెంట్ పై సింపతీ గట్టిగానే పని చేసింది అని కొందరు అంటున్నారు.

Exit mobile version