మన ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా తక్కువగా క్లాసికల్ మూవీస్ వస్తున్నాయి. గతంలో మనకు ‘గుండమ్మ కథ’ మరియు ‘మిస్సమ్మ’ మొదలైన మల్టీ స్టారర్ క్లాసికల్ మూవీస్ ఉండేటివి, కానీ ఇటీవల కాలంలో అలాంటి సినిమాలు ఏమీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే ఓ మల్టీ స్టారర్ క్లాసికల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీలో మార్పు వస్తుందని అనుకుంటున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది మరియు ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ‘న భూతో న భవిష్యతి’ అనే విధంగా ఉంటుందని అంటున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి మరియు ఈ చిత్రంపై అన్ని వర్గాల వారికీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎలాంటి కొత్త రకమైన ట్రెండ్ కి నాంది పలుకుతుందో మరియు ఇండస్ట్రీలో ఎన్ని రికార్డ్స్ నెలకొల్పుతుందో వేచి చూడాలి.
వెంకటేష్, మహేష్ బాబు, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు రోహిణి హత్తాంగది కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.