సూర్యతో క్రేజీ డైరెక్టర్ సినిమా.. ఉత్కంఠలో ఫ్యాన్స్


ప్రస్తుతం హీరో సూర్య సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. పలు వాయిదాల తర్వాత ఈ చిత్రం రేపు 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఇంకొన్ని కొత్త చిత్రాలకు కమిటవుతున్నారు. వాటిలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ చిత్రం కూడా ఉండనుందని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే గౌతమ్ మీనన్, సూర్యల కాంబో గురించి వార్తలు వచ్చినా ఎక్కడా కన్ఫర్మేషన్ అందలేదు.

మళ్లీ వారిద్దరూ కలిసి సినిమా చేయనున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ పూర్తయ్యాయని, దీపావళి తర్వాత సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘కాక్క కాక్క, సూర్య సన్నాఫ్ కృష్ణన్` వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే వీరి కాంబినేషన్ మీద వార్తలు రాగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version