విజయ్ కూడా సూర్యను ఫాలో అవుతాడా ?

విజయ్ కూడా సూర్యను ఫాలో అవుతాడా ?

Published on Aug 23, 2020 12:01 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్‌ ఉంది. అయితే సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబ‌ర్ 30న విడుద‌ల కాతుంది. థియేట‌ర్స్‌ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ చిత్రాన్ని అమెజాన్‌లో విడుద‌ల చేయ‌డానికి రెడీ అయ్యారు మేకర్స్. కాగా విజయ్ మాస్టర్‌ కూడా ఓటిటిలో విడుదల చేయాలని యూనిట్ యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇక విజయ్ గత సినిమా ‘బిగిల్’ తెలుగులో ‘విజిల్’గా వచ్చి ఇక్కడ మంచి కలెక్షన్స్ ను రాబట్టి, విజయ్ కు మాస్ ప్రేక్షకులలో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది. తెలుగులో విజయ్ పాత్రకు హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెబుతున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపించనున్నారు.

తాజా వార్తలు