బ్రదర్స్ ఏ సినిమాకి రిమేక్ కాదట

బ్రదర్స్ ఏ సినిమాకి రిమేక్ కాదట

Published on Oct 3, 2012 4:20 AM IST


“బ్రదర్స్” చిత్రం “స్టక్ ఆన్ యు” అనే హాలివుడ్ చిత్రానికి రీమేక్ అన్న పుకారు మీద విసిగిపోయిన సూర్య ఈ పుకార్లను ఖండించారు. చెన్నైలో ఒకానొక ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ అసలు ఆ హాలివుడ్ చిత్రం ఏదో కూడా నాకు తెలియదు పలుచోట్ల ఈ చిత్రం ఆ హాలివుడ్ చిత్రానికి రీమేక్ అని చెబుతున్నారు. ఈ చిత్రం కోసం కే వి ఆనంద్ దాదాపుగా నాలుగేళ్ళు కష్టపడ్డారని సూర్య చెప్పారు. ఈ చిత్రంలో అయన అవిభక్త కవలలుగా కనిపించనున్నారు. ఇందులో ఒక సూర్య కి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పగా మరో సూర్య కి అయన తమ్ముడు కార్తి డబ్బింగ్ చెప్పారు.కాజల్ కథానాయికగా నటిస్తుండగా ఈ చిత్రం తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేస్తున్నారు. అన్ని సరిగ్గా జరిగితే ఈ చిత్రం అక్టోబర్ 12న విడుదల అవుతుంది. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు