గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2 – తాండవం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ దగ్గర శివతాండవం చేయడం ఖాయమని నందమూరి అభిమానులు ఫిక్స్ అయ్యారు.
అయితే, ఈ సినిమాను సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ తొలుత ప్రకటించారు. కానీ, ఈ సినిమాపై నెలకొన్న భారీ హైప్‌ను అందుకునేందుకు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, రీ-రికార్డింగ్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తాము ముందుగా ప్రకటించిన సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. ఈ సినిమా అందరికీ నచ్చే విధంగా త్వరలోనే మరో కొత్త డేట్‌తో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించారు. దీంతో ‘అఖండ 2’ వాయిదాను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.
#Akhanda2 – AN IMPORTANT ANNOUNCEMENT.#Akhanda2Thaandavam
'GOD OF MASSES' #NandamuriBalakrishna #BoyapatiSreenu @AadhiOfficial @MusicThaman @14ReelsPlus @iamsamyuktha_ @RaamAchanta #GopiAchanta #MTejeswiniNandamuri @kotiparuchuri @ivyofficial2023 pic.twitter.com/3cKUSuehyS— 14 Reels Plus (@14ReelsPlus) August 28, 2025