అఖండ 2 తప్పుకోవడంతో సింగిల్‌గా దిగుతున్న ఓజి.. ఇక రికార్డులు గల్లంతే..!

అఖండ 2 తప్పుకోవడంతో సింగిల్‌గా దిగుతున్న ఓజి.. ఇక రికార్డులు గల్లంతే..!

Published on Aug 28, 2025 11:00 PM IST

OG-Akhanda-2

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ నెలలో రెండు భారీ చిత్రాలు తమ రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2 – తాండవం’తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ కూడా సెప్టెంబర్ 25న రిలీజ్‌కు రెడీ అయింది. దీంతో ఈ రెండు భారీ చిత్రాల మధ్య పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

కానీ, ఇప్పుడు ఈ పోటీ నుంచి బాలకృష్ణ ‘అఖండ 2’ తప్పుకుంది. తమ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయడం లేదని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. దీంతో ఓజి చిత్రానికి లైన్ క్లియర్ అయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25న సింగిల్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఓజి, బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ అంటున్నారు.

కాగా, ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా సుజిత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా డైరెక్ట్ చేస్తున్నాడు.

తాజా వార్తలు