మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష, ఆశిక రంగనాథ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రమే “విశ్వంభర”. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో మంచి మార్కులు అందుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఇదిలా ఉండగా ఈ సినిమా తాలూకా ఓటీటీ పార్ట్నర్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాని జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.