‘హను మాన్’ స్ట్రాటజీ తోనే ‘మిరాయ్’.. వర్కౌట్ అయితే మాత్రం..!

‘హను మాన్’ స్ట్రాటజీ తోనే ‘మిరాయ్’.. వర్కౌట్ అయితే మాత్రం..!

Published on Aug 28, 2025 6:05 PM IST

hanuman

మన టాలీవుడ్ కి మొదటి సూపర్ హీరో సినిమా అందించిన టాలెంటెడ్ యువ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన మరో సూపర్ హీరో తరహా చిత్రమే “మిరాయ్”. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కాకుండా పాన్ వరల్డ్ వైడ్ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే హను మాన్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత మళ్ళీ అదే రీతి భారీ గ్రాఫిక్స్ ఇంకా డివోషనల్ టచ్ తో రాబోతున్న సినిమాగా ట్రైలర్ తో మరింత క్లారిటీ వచ్చింది.

అయితే తెలుగు స్టేట్స్ లో ఈ మధ్య పలు సినిమాలకి సంబంధం లేకపోయినా కూడా టికెట్ ధరల పెంచుకుంటూ వచ్చారు. అయితే గతంలో హను మాన్ సినిమాకి మేకర్స్ ఎలాంటి టికెట్ ధరలు పెంచకుండా నార్మల్ రేట్ల తోనే విడుదల చేసి భారీ వసూళ్లు అందుకున్నారు. ఇక ఇపుడు ఇదే స్ట్రాటజీలో మిరాయ్ కూడా తీసుకొస్తున్నారు.

తమ సినిమాకి ఎలాంటి టికెట్ ధరల పెంపు లేదని లేటెస్ట్ ట్రైలర్ లాంచ్ లో మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇలా సామాన్యుడికి కూడా మంచి కంటెంట్ అందుబాటులో పెడితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో హను మాన్ తో ప్రూవ్ అయ్యింది. మరి మళ్ళీ అలానే మిరాయ్ కి జరిగినా కూడా ఆశ్చర్యం లేదు. సో మిరాయ్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో అనేది చూడాలి.

తాజా వార్తలు