కోలీవుడ్ సింగం సూర్యకు మన దగ్గర కూడా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. తాను ఎంచుకునే డిఫరెంట్ సబ్జెక్టులతో ఎన్నో వైవిధ్యభరత ప్రయోగాలు చేసిన సూర్య ఇప్పుడు “ఆకాశమే నీ హద్దురా” అనే మరో చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అయ్యాడు.
తమిళంలో లేడీ డైరెక్టర్ సుధా కాంగ్ర తెరకెక్కించిన ఈ చిత్రం మన రెండు భాషల్లోనూ మంచి హైప్ ను తెచ్చుకుంది. కానీ కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ మూలాన వాయిదా పడాల్సి వచ్చింది. దీనితో ఈ మధ్యలో ఓటిటి సంస్థలు ఆఫర్లు ఇవ్వడంతో చాలా కొత్త సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ గానే విడుదల కావచ్చాయి.
అలాగే సూర్య సినిమా పై కూడా రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు వాటిని నిజం చేస్తూ స్వయంగా సూర్యానే ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ కానుంది అని స్వయంగా ప్రకటించారు. ఇది మాత్రం ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి. ఈ చిత్రం వచ్చే అక్టోబర్ 30 వ తారీఖున డిజిటల్ గా విడుదల కానుంది. మరి రెండు భాషల్లోనూ అందుబాటులోకి రానుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Vinayagar Chathurthi wishes to all!#SooraraiPottruOnPrime @PrimeVideoIN pic.twitter.com/ZdYSF52ye2
— Suriya Sivakumar (@Suriya_offl) August 22, 2020