తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక లెజండ్రీ నటుడు. ఆయన సుమారు 330కి పైగా సినిమాల్లో నటించారు. అయన తన కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించినప్పటికీ ఆయన చేసిన ‘ఎన్ కౌంటర్’ సినిమా మాత్రం ఆయనకి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
ఎన్ కౌంటర్ సినిమాలో కృష్ణ నక్సలైట్ లీడర్ పాత్ర పోషించారు. ఈ పాత్రకి అటు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుంచి మంచి ప్రశంశలు దక్కాయి. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఎన్. శంకర్ పేరు ఎన్ కౌంటర్ శంకర్ గా మారిపోయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన అనుభవాల్ని గుర్తు చేసుకున్న శంకర్ మాట్లాడుతూ ‘ ఈ సినిమా అకోసం వికారాబాద్ ఫారెస్ట్, తలకోన, హార్సిలీ హిల్స్, భద్రాచలం పలు అడవుల్లో షూట్ చేసాము. ఒక రోజు షూటింగ్ సమయంలో కృష్ణ గారు ఏకే 47 ని పట్టుకోవాలి. అక్కడ ఉన్న నక్సలైట్లు కొంతమంది కృష్ణ గారి దగ్గరికి వచ్చి ఏకే 47 ఇలా పట్టుకోవాలని చెప్పి అక్కడి నుండి మాయమయ్యారు. ఆ తర్వాత చేసిన సీన్ చాలా బాగా వచ్చిందని’ అన్నాడు.
రోజా, రమేష్ బాబు, వినోద్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ గారే నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.