ఓటీటీలో ‘లిటిల్ హార్ట్స్’.. క్లారిటీ ఇచ్చిన ఈటీవీ విన్

ఓటీటీలో ‘లిటిల్ హార్ట్స్’.. క్లారిటీ ఇచ్చిన ఈటీవీ విన్

Published on Sep 20, 2025 8:00 AM IST

Little Hearts

టాలీవుడ్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. సాయి మార్తాండ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మౌళి తనుజ్, శివాని నగరం హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని కామెడీ, లవ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లను రాబట్టి ఇంకా సాలిడ్‌గా రన్ అవుతోంది. అయితే, ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై ఈటీవీ విన్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఈటీవీ విన్ వద్ద ‘లిటిల్ హార్ట్స్’ ఓటీటీ రైట్స్ ఉన్నది నిజమే.. అయినా, ఇప్పట్లో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు.

థియటర్లలో ఇంకా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ తామే చెబుతామని ఈటీవీ విన్ ప్రకటించింది. ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాను బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.

తాజా వార్తలు