సునీల్ అల్లు అర్జున్ కథను మలుపు తిప్పుతాడట

సునీల్ అల్లు అర్జున్ కథను మలుపు తిప్పుతాడట

Published on Feb 12, 2021 11:49 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. ‘అలవైకుంఠపురములో’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న సినిమా కావడం అందునా సుకుమార్ దర్శకత్వం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అనేక ఆండ్డంకులను ఎదుర్కొని అనుకున్న ప్రకారమే సినిమా చిత్రీకరణ చేస్తున్నారు టీమ్. సినిమాకు అన్నీ కుదిరాయి కానీ ప్రతినాయకుడే ఇంకా కుదరలేదు. అయితే తాజాగా ఇందులో సునీల్ విలన్ రోల్ చేస్తున్నట్టు పక్కా సమాచారం అందుతోంది.

ఇన్నాళ్లు ఇది ఒక ఊహాగానంగానే ఉన్నా ఇప్పుడు మాత్రం నిజమని తెలుస్తోంది. కథలో సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నారట. ఆయన పాత్ర కథలోకి ఒక కీలకమైన మలుపుకు కారణమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ‘డిస్కో రాజా, కలర్ ఫోటో’ లాంటి సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు చేసి మెప్పించారు సునీల్. అందుకే ఆయనకు ఈ సినిమాలో నెగెటివ్ రోల్ ఇచ్చారట సుకుమార్. ఆగష్టు 13వ తేదీన ఈ సినిమా విడుదలకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు