యువతారగా తెలుగు ఇండస్ట్రీలో వెలుగుతున్న సందీప్ కిషన్ త్వరలో కొత్త అవతారంలో కనబడనున్నాడు. కండల తిరిగిన దేహంలో దర్శనమివ్వడానికి రొటీన్ ఎక్సెర్సైజ్ లే కాక ప్రత్యేక కసరత్తులు కూడా చేస్తున్నాడు
“నా రొటీన్ వర్క్ అవుట్ మొదలై 20రోజులయింది… ఇంకా 30రోజులు మాత్రమే మిగిలుంది” అని ట్వీట్ చేసిన ఫోటోని చూస్తే ఎంత కష్టపడుతున్నాడో మీకే తెలుస్తుంది. ఒకసారి ఆ ఫోటో వైపు లుక్కేయండి. సందీప్ గతఏడాది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో విజయం సాధించాడు. మరి ఈ కొత్త లుక్ ఏ ప్రాజెక్ట్ కోసమో చూడాలి