ఆగస్ట్ 24న రానున్న సుడిగాడు


అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం “సుడిగాడు” ఆగస్ట్ 24న విడుదలకు సిద్దమయ్యింది. భీమినేని శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా అరుంధతి మూవీస్ బ్యానర్ మీద చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి ‘ఒక టికెట్ పై 100 చిత్రాలు” అనేది శీర్షిక. ఈ చిత్రంలో గత రెండు దశాబ్దాలలో విడుదలయిన 100 పైగా చిత్రాలను ఈ చిత్రంలో స్పూఫ్ చేసినట్టు ఈ మధ్యనే అల్లరి నరేష్ చెప్పారు. ఈ చిత్రం ఆసాంతం వినోదాత్మకంగా మలిచినట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్ర ట్రైలర్ మరియు పోస్టర్లు ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తించాయి. ఈ చిత్రానికి శ్రీ వసంత సంగీతం అందించారు.

Exit mobile version