అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే సీడెడ్ లో కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఈ చిత్రం సీడెడ్ లో మూడు రోజుల్లో 1 కోటి 10 లక్షల షేర్ సంపాదించింది. అల్లరి నరేష్ చిత్రానికి ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం ఇదే మొదటసారి మరియు ఒక పెద్ద హీరో సినిమాకి వచ్చినట్టు ఈ చిత్రానికి కలెక్షన్లు వస్తున్నాయి.
సినీ అభిమానులను ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంటోంది మరియు ఈ చిత్రంలో చేసిన పేరడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మోనాల్ గజ్జర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస్ రావు దర్శకతవం వహించారు.
ఈ చిత్ర అన్ని ఏరియాల కలెక్షన్ల లిస్టును త్వరలోనే మీకందిస్తాము.