సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సుడిగాడు’

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఆగష్టు 24న విడుదల కానుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలోని సన్నివేశాలను తీసుకొని ఈ చిత్రంలో పేరడీ చేసారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అరుందతి మూవీస్ బ్యానర్ పై చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం అందించారు. శ్రీ వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం రికార్డు బుజినెస్ చేసింది మరియు అల్లరి నరేష్ కెరీర్లో కమర్షియల్ గా మంచి సక్సెస్ సాదిస్తుందని సినీ పండితులు భావిస్తున్నారు.

Exit mobile version