యూఎస్‌లో ‘శుభం’ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవే!

స్టార్ బ్యూటీ సమంత ప్రొడ్యూసర్‌గా తన తొలి చిత్రం ‘శుభం’ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను హార్రర్ కామెడీ చిత్రంగా దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలోని కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

టాలీవుడ్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్రం అమెరికాలో ఇప్పటివరకు ఏకంగా 100K డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా ఈ వీకెండ్ మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. మరి శుభం చిత్రం ఈ వీకెండ్‌లో ఓవర్సీస్ మార్కెట్ దగ్గర ఎంతమేర వసూళ్లను రాబడుతుందో చూడాలి.

Exit mobile version