‘శుభం’ తొలిరోజు వసూళ్లు ఎంతంటే..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నిర్మాతగా మారి చేసిన తొలి సినిమా ‘శుభం’ మే 9న మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కొత్తవారికి ఆమె ఛాన్స్ ఇవ్వగా ఈ చిత్రాన్ని ప్రదీప్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు. హార్రర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు తొలిరోజు బాక్సాఫీస్ పరంగా ఓ మోస్తరు కలెక్షన్స్ వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. ‘శుభం’ సినిమాకు ఓపెనింగ్ రోజున వరల్డ్‌వైడ్‌గా రూ.1.5 కోట్ల వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. చిన్న సినిమా అయినా, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని వారు చెబుతున్నారు. వీకెండ్ కావడంతో ఈ మూవీకి వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొంతం, శ్రావణ లక్ష్మి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

Exit mobile version